గలీజ్ శ్రీనివాస్

దొంగతనం బయటపడేంతవరకు అంతా దొరలే… సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ గొప్ప మాటలు చెప్పే వారి బుద్దులు కూడా గొప్పగా ఉంటాయనుకోవడం నిజంకాదని గజల్ శ్రీనివాస్ వ్యవహారంతో మరోసార తెటతెల్లం అయింది. పెద్ద పెద్ద కబుర్లు చెప్తు ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న శ్రీనివాస్ నిజస్వరూపం ఒక మహిళ వల్ల బయటి ప్రపంచానికి తెలిసింది. ఆఫీసుల్లో ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే నీచులకు మన సమాజంలో కొదవేం లేదు. వెకిలి చూపులు.. అంతకుమించిన వెకిలి మాటలకు కార్యాలయాల్లో ఆడవాళ్లని చూస్తే చొంగకార్చే రకాలు ఎంతో మంది… సేవ్ టెంపుల్స్ అంటు దేవాలయాల పరిక్షణ అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చెప్పుకుంటున్న గజల్ శ్రీనివాస్ అసలు స్వరూపం ఇప్పుడు బాహ్యప్రపంచానికి తెలిసింది.
ఒక మహిళతో అభ్యంతరక స్థితిలో ఉన్న గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన వీడియో లు పోలీసులకు చిక్కాయి. తనను రెండు నెలలుగా వేధిస్తున్నాడంటూ చెప్తున్న సదరు మహిళ పక్కా ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో గజల్ శ్రీనివాస్ తప్పించుకునే అవకాశాలు లేకుండా పోయాయి. కళాకారుడిగానే కాకుండా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే శ్రీనివాస్ చాలా మంది నేతలకు సన్నిహితుడిగా పేరుంది. పాటలు పాడడంతో పాటుగా సామాజిక కార్యక్రమాల్లో చిరుగ్గా పాల్గొనే అతను మహిళల విషయంలో ఉన్న బలహీత అతన్ని పాతాళానికి దింపింది.
జగన్ శ్రీనివాస్ చెప్పింది చేయి భవిష్యత్తు బాగుంటుందని మరో మహిళే బాధితురాలిని ప్రోత్సహించిన వైనం ఇక్కడ మరో కోణం. తాను చేసినట్టుగానే చేయాలంటూ సదరు మహిళ తనకు చెప్పిందని ఆయన మాటలు వింటే ఉన్నత స్థితిలో ఉంటావని లేకుంటే పుట్టగతులు ఉండవంటూ బెదిరింపులకు సైతం దిగినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.