నగరానికి కొత్త ఫ్లైఓవర్లు – శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు హైదరాబాద్ లో కొత్త ఫ్లైఓవర్లు , రోడ్ల విస్తరణ కార్యక్రమాలకు శంఖుస్థాపనలు జరిగాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా జీహెచ్ఎంసీ నిధులను ఖర్చు చేస్తోంది. అంబర్ పేట – ఉప్పల్ ఫ్లై ఓవర్ తో పాటుగా ఆరాంఘర్, మెదక్ రోడ్డు విస్తరణ పనులను కేంద్ర మంత్రి నిత్ గడ్కారీ, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు.
ఈ శంఖుస్తాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గఢ్కారీతో పాటుగా ప్యూటీ సీఎం మహముద్ అలీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంబర్‌పేట చౌరస్తా వద్ద రూ.186.71 కోట్లతో నిర్మించనున్న 1.465 కిలోమీటర్ల నిడివి గల నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ వ్యయానికి అదనంగా రూ.40 కోట్లు భూసేకరణకు ఖర్చు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.226.88 కోట్లుగా నిర్ధారించారు. అంబర్‌పేట ఛే నంబర్ కూడలి నుంచి శ్రీరమణ థియేటర్ కూడలి వరకు నిత్యం ఉండే ట్రాఫిక్ జాంలు ఈ వంతెనతో తీరనున్నాయి.
ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ రహదారిలోని సీపీఆర్‌ఐ వరకు దాదాపు 6.25 కిలోమీటర్ల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.626.76 కోట్లు. నిర్మాణ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, భూసేకరణ ఖర్చు రూ.768.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఉప్పల్ జంక్షన్ వద్ద మెట్రోపై నుంచి ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. దీనికి రూ.311 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
హైదరాబాద్-ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ సెక్షన్‌లో 62.92 కిలోమీటర్ల నిడివి గల డబుల్‌లేన్ల జాతీయ రహదారికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.426.52 కోట్లు. ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్, నర్సాపూర్, కౌడిపల్లి, అప్పాజీపల్లి, రాంపూర్, మెదక్ పట్టణాల మధ్య అనుసంధానం, ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్, శంషాబాద్ సెక్షన్‌లో 10.48 కిలోమీటర్ల నిడివి గల ఆరు వరుసల రహదారికి కూడా శంకుస్థాపన చేశారు. దీనిని ఈపీసీ పద్ధతిన నిర్మించనున్నారు. దీని అంచనా విలువ 283.15 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లను విడుదల చేయనుంది. రాష్ట్ర రాజధానికి విమానాశ్రయాన్ని కలిపే అతి ముఖ్యమైన ఈ రహదారిని 1.2 కిలోమీటర్ల నిడివి గల ఎలివేటెడ్ కారిడార్ వంటి అధునాతన సదుపాయాలతో నిర్మించనున్నారు. రోడ్డు మధ్యమధ్యలో మూడు ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. ఈ రూట్‌లో ట్రాఫిక్ జాంలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తిచేయాలన్నది లక్ష్యం.
ప్రపంచస్థాయి నగరంలో ఎదుకుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర అన్ని విధాలుగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా అండదండలను అందిస్తుందన్నారు.
హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పరిష్కారాలు చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.తెలంగాణకు సహకరిస్తున్న కేంద్రమంత్రి గడ్కరీకి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. నితిన్ గడ్కరీ కార్యదక్షతను సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రస్తావించినట్లు వెల్లడించారు.
flayover,hyderabad,uppal,amberpet,traffic, hyderabad traffic,hyderabad city, telangana, central minister, ktr, telangana government,

అకాల వర్షాలు కురుస్తాయి-వాతావరణ శాఖ హెచ్చరికHyderabad