రైతు అభ్యర్థుల వినూత్న ప్రచారం

0
126

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని పసుపు, ఎర్రజొన్న రైతులు ఈ సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసి వినూత్న నిరసనతో దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అన్నదాతలు మద్దతు కూడగట్టడానికి రంగంలోకి దిగారు, రైతులు, రైతుకూలీలు, ప్రజల మద్దతు కోరుతూ సోమవారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ, సమస్యలను జాతీయస్థాయికి తీసుకెళ్లడానికే పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు రైతులు వివరించారు. సోమవారం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని రైతులు భిక్షాటన చేస్తూ వినూత్న ప్రచారం చేశారు.వీరి ప్రచారానికి కొన్ని గ్రామాల్లోని రైతుసంఘాల ప్రతినిధుల నుంచి మద్దతు లభించింది. ఈ సమయంలో పార్టీల జెండాలను పక్కన పెట్టాలని, అన్నదాతలు ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.మరోవైపు జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లోనూ రైతులు భిక్షాటన చేశారు.

Wanna Share it with loved ones?