పెద్దమొత్తంలో రు.2000 నకిలీ నోట్ల పట్టివేత

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెండువేల రూపాయలకు నలికీలు పుట్టుకొస్తున్నాయి. విదేశాల్లో తయారవుతున్న నకిలీ నోట్లు అచ్చంగా అచ్చుగుద్దినట్టు అసలు నోట్లలాగానే ఉంటూ జనాలను బురిడీ కొట్టిస్తున్నాయి. బాంగ్లాదేశ్ నుండి భారత్ లోకి నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠాను పశ్చిమ బెంగాలు పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుండి పెద్దమొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. బాంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్ లోకి వస్తున్న వీరిని గుర్తించిన బీఎస్ఎఫ్ బలగాలు వారిని పట్టుకోగా వారి వద్ద నకిలీ నోట్లు బయటపడ్డాయి. దీనితో నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠాను బీఎస్ఎఫ్ బలగాలు పోలీసులకు అప్పగించాయి. నకిలీ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు వాటిని ఎవరికి సరఫరా చేస్తున్నారు అనేది పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.