మల్కాజ్ గిరి ఎగ్జిభిషన్ కు ఏర్పాట్లు పూర్తి

మల్కాజ్ గిరిలోని బృందావన్ గార్డెన్స్ లో ఈనెల 30న నిర్వహించనున్న ఎగ్జిబిషన్ కు నిర్వహాకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అనేక రకాల వస్తువులకు సంబంధించిన 150కి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు. బ్రాహ్మణ చిరువ్యాపారులకు ఉపయోగ పడే విధంగా వారికోసమే ప్రత్యేకంగా స్టాళ్లను కేటాయించినట్టు వారు చెప్పారు. పెద్ద ఎత్తున బ్రాహ్మణ వ్యాపారుల నుండి స్పందన వచ్చిందని స్టాల్స్ కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. స్టాళ్ల ను ఏర్పాటు చేసుకున్న వారికి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. వారికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను అందిస్తున్నట్టు చెప్పారు.
ఈ ప్రదర్శనలో భాగంగా ఉచిత వైద్య శిభిరం, మేగా జాబ్ మేళాతో పాటుగా రంగోలి పోటీలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. ఇతర వివరాల కోసం లక్ష్మీకాంత్ లేదా పూర్ణిమలను 7013241767, సంప్రదించవచ్చు.