జమ్ముకాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్|encounter in JK

జమ్ముకాశ్మీర్ లో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 8మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. ఈ క్రమంలో ఇద్దరు జవాన్లకు కూడా గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్, అనంతనాగ్ జిల్లాల్లో ఈ ఎన్ కౌంంటర్లు జరిగాయి. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు ఉగ్రవాదులు హతమవగా అనంతనాగ్ జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో ముష్కరుడిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. మరోకడిని ప్రాణాలతో పట్టుకున్నారు.
జమ్ముకాశ్మీర్ లోని దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువకావడంతో దీనిపై దృష్టిపెట్టిన భద్రతాదళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. స్థానిక పోలీసుల సహకారంతో సైన్యం, పారమిలటరీ బలగాలు జరిపిన గాలింపుల్లో భద్రతా బలగాలను తారసపడ్డ ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు. ఇరు వర్గాల మధ్య హోరా హోరీగా జరిగిన కాల్పుల్లో 8మందిని భద్రతాబలగాలు మట్టుపెట్టగలగాయి.
షోపియాన్ జిల్లాలోని మరో ప్రాంతంలో నలుగురు ఉగ్రాదులు స్థానికులను బంధీలుగా పట్టకున్నట్టు సమాచారం. వాడిని విడపించేందుకు భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో కొంత మంది స్థానిక యువకులు భద్రతా బలగాలపై రాళ్లు విసిరడంతో భద్రతా దళాలు వారిని చెదరగొట్టాయి. ఈ క్రమంలో పలువురికి గాయాలయినట్టు తెలుస్తోంది.
ఎన్ కౌౌంటర్ జరిగిన ప్రాంతానికి భారీగా అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా దక్షిణ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైళ్లు, బస్సు సర్వీసులను కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది.
స్థానిక యువతను మచ్చికచేసుకోవడం ద్వారా ఉగ్రమూకలు భద్రతా దళాలపై దాడులకు తెగబడుతున్నాయి. దక్షిణ కాశ్మీర్ లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీనితో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టిన బలగాలు మెరుపు దాడిచేశాయి. ఇటీవలి కాలంలో ఈ తరహా మెరుపు దాడులకు దిగడం ఇదే మొదటిసారిని సైనిక అధికారులు చెప్తున్నారు.
అమాయక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఉగ్రవాదులకు సహకరించే వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని సైనిక,పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మువతను రెచ్చగొడుతున్న ఉగ్రమూకలు వారిని ముందు పెట్టి బలగాలపై దాడులు జరుపుతున్నాయని వారు పేర్కొన్నారు. స్థానిక యువకులు ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారు కోరుతున్నారు. భారీ ఎన్ కౌౌంటర్ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Eight militants, including top commanders, have been killed in an encounter in jammu and kashmir.and one militant was caught alive.Two soldiers were injured in the operations.
seven bodies of militants have been recovered from Shopian’s Draggad, One militant was killed in Anantnag’s Dialgam.
first time that the security forces in south Kashmir are carrying out counter-insurgency operations.
As locals clashed with the security forces t least a dozen protesters were injured.
jammu and kashmir
పాకిస్థాన్