నిజమైన బాహుబలి…

లోయలోపడిపోయిన గున్న ఏనుగును అతికష్టంమీద రక్షించిన పళనిచామి శరత్ కుమార్ హీరోగా మారిపోయాడు… ఏనుగు పిల్లను బుజంపై మోసుకుని పోతున్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది. దీన్ని చూసిన పలువురు శరత్ కుమార్ ను ప్రశంసిస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా నిజమైన బాహుబలి అంటు ట్విట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఘాట్ రోడ్డు మార్గంలో వెళ్తున్న ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. అక్కడి నుండి అది రాలేక నానాయతన పడడంతో తల్లి ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిల్చుండిపోయింది. దాన్ని రోడ్డుపై నుండి పక్కకు తప్పించడానికి ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్న వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో ట్రాఫిక్ నిల్చిపోయింది.
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులకు లోయలో పడిపోయిన ఏనుగు పిల్ల కనిపించింది. దీనితో పళనిచామి శరత్ కుమార్ ఏనుగు పిల్లను పైకి తీసుకుని వచ్చాడు. పూర్తిగా నీరసించిపోయిన ఆ పిల్ల ఏనుగు నడవలేని స్థితిలో ఉండడంతో దాన్ని ఎత్తుకుని తల్లిదగ్గరకు చేర్చాడు. గున్న ఏనుగు రక్షించేందుకు శరత్ కుమార్ పడిన కష్టంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.