ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం-ఇక ఆగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్

ebc bill ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా కుల, మతాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలందరికీ 10శాతం రిజర్వేషన్ లభిస్తుంది. మంగళవారం లోక్ సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా అధికార పక్షానికి బలం లేని రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోద ముద్ర పడడంతో ఇక ఈ బిల్లుకు చట్టబద్దత వచ్చినట్టయింది. ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే కావడంతో అగ్రవర్ణాల్లోని పేదలతోపాటుగా ఆర్థికంగా వెనుకబడిన ప్రతీ ఒక్కరికీ 10శాతం రిజర్వేషన్ దక్కనుంది.