31 రాత్రి మస్తుగా తనిఖీలు-తాగి వాహనాలు నడిపితే తప్పదు జైలు

నూతన సంవత్సరానికి మధ్యంతో స్వాగతం పలుకుదామనుకుంటున్నారా? అయితే మీ వాహనాలను నడపడానికి ఎవరినైనా ముందుగానే చూసుకోండి.. ఎందుకంటే ఆ రోజున పెద్ద ఎత్తున తనిఖీలు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి మధ్యం సేవించి వాహనాలు నడిపేవారి భతరతం పట్టేందుకు పోలీసులు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమితికి మించి మధ్యం సేవించి వాహనాలు తప్పితే ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో భారీ ఎత్తున వాహన తనిఖీలు నిర్వహించబోతున్నట్టు హైదరాబాద్ ట్రాపిక్ డీసీపీ రంగనాథ్ తెలిపారు. పెద్ద సంఖ్యలో బృందాలు వాహనాలను తనిఖీ చేస్తాయని మధ్యం సేవించి పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
తాగి వాహనాలు నడిపిపే వారిని ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా పట్టుబడే వారి కేసుల వివరాలను వారి ఆధార్ కార్డ్, పాస్ పోర్టులతో అనుసంధానం చేస్తామన్నారు. దీని వల్ల రాబోయే రోజుల్లో కూడా వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నగర వాసులు ప్రశాంతంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, మధ్యం సేవించిన వాళ్లు ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించారు. మధ్యం తాగి వాహనాలు నడిపితే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. తాగి వాహనాలు నడిపేవారికి జైలు శిక్షలు కూడా పడుతున్నాయని చెప్పారు.