వంటపని, ఇంటి పని చేయించడం గృహహింస కాదు:బాంబే హైకోర్టు

* ఇంటి పనులు చేయడమనడం గృహహింస కాదు
* రుచిగా వండమనడం కూడా తప్పు కాదు
* స్పష్టం చేసిన కోర్టు…

మగవాళ్లకో శుభవార్త… మీరు మీ భార్యని రుచిగా వండిపెట్టమని అడగవచ్చు.. ఇంటిని శుభ్రంగా ఉంచమని కూడా చెప్పవచ్చు… ఇది ఏమాత్రం గృహహింస కాదు… ఈ విషయాన్ని బాంబే హైకోర్టే స్పష్టం చేసింది. రుచిగా వండాలని, ఇంటి పనులు చేయాలని భార్యకు భర్త చెప్పడంలో ఎటువంటి తప్పలేదని కోర్టు పేర్కొంది. ఇక అసలు కేసు విషయానికి వస్తే…
ముంబాయిలోని సంగ్లి ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తి భార్య 17 సంవత్సరాల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్తతో పాటుగా అత్తమామలు తనను ఇంటి పనులు సరిగా చేయడం లేదని, రుచిగా వడడం లేదని హింసించారని, వీటితో పాటుగా తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని అందువల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ సాగింది. బాంబే హైకోర్టు దీనిపై తుదితీర్పును వెలువరిస్తూ రుచిగా వంటచేయమని చెప్పడం, ఇంటి పనులు చేయమని చెప్పడం గృహహింసగా భావించలేమని తీర్పు చెప్పింది.
ఇంటి పనులు సరిగా చేయకపోవడంలేదని, వంట రుచిగా వండడంలేదని భర్త అనండం గృహహింసకాదని ఈ కేసులో కూడా ఇదే విషయం వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆత్మహత్యకు పాల్పడిన మహిళ భర్త విజయ్ కు ఎటువంటి వివాహేతర సంబంధాలు లేవని తేలిందన్నారు. ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ లాయర్ నిందితుల కుటుంబీకులను సరిగ్గా విచారించలేదని అందువల్ల వారిని దోషులుగా ప్రకటించలేమని న్యాయమూర్తి అన్నారు.
mumbai high court, domestic violence.

భారీ ఎన్ కౌంటర్ 14 మంది మావోయిస్టులు మృతి