దీపావళి సెలవు తేదీలో మార్పు

0
57

దీపావళి సెలవు దినాన్ని మార్చాలంటూ వచ్చిన వినతి మేరకు దీపావళి సెలవును 18వ తేదీకి బదులుగా 19న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి ముఖ్యమంత్రి ఆమోదముద్రకోసం దస్తాన్ని ఆయన కార్యాలయానికి పంపారు. సెలవు దినాన్ని 19కి మారుస్తు అధికారికంగా ముఖ్యమంత్రి ఆమోదం లభించిన తరువాత ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. 2017 ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం దీపావళి సెలవును 18వ తేదీగా పేర్కొన్నారు. అయితే అమావాస్య 19న ఉండడంతో దీపావళి పండుగను ఆదే రోజు జరుపుకుంటున్నందున సెలవు దినాన్ని మార్చాలంటూ వచ్చిన అభ్యర్థలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెలవు దినాన్ని మార్చుతూ దస్తాన్ని సిద్ధం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ఆమోదం లభించిన తరువాత అధికారిక ప్రకటన వెలువడుతుంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here