అమ్మకు నిజమైన వారసుడిని నేనే:దినకరన్

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నిజమైన వారసుడిని తానే నని శశికళ సమీప బంధువు దినకరన్ అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేలిపోయిందని ఆయన అన్నారు. జయలలిత మృతి వల్ల ఏర్పడిన ఖాళీ కారణంగా ఆర్కెనగర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందాడు. సమీప అధికార అన్నాడీఎంకే అభ్యర్థిపై 40వేలకు పైగా మెజార్టీతో గెలుపొందాడు. అమ్మకు నిజమైన వారుసుడిని కనుకనే తమపై నమ్మకంతో ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించారని దినకరన్ అంటున్నారు. తనను గెలిపించిన ఆర్కేనగర్ నియోజకవర్గం ప్రజలకు ఆయన కృతజ్ఞతులు తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలిపోతుందని దినకరన్ జోస్యం చెప్పారు. దివంగత జయలలితతు నిజమైన వారసులు ఎవరు అనే సంగతి తమిళ ప్రజలకు తెలుసని ఆయన అన్నారు.