బాణాసంచాపై నిషేధం కొనసాగుతుంది:సుప్రీం

దేశరాజధాని ఢిల్లో తో పాటుగా శివారు ప్రాంతాల్లో బాణాసంచా అమ్మకాలపై విధించిన నిషేధం పై ఎటువంటి సడలింపు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీపావళి సమీపిస్తున్న నేపధ్యంలో బాణాసంచా పై విధించిన నిషేదాన్ని పరిశీలించాల్సిందిగా వేసిన రివ్యూ పిటీషన్ ను కోర్టు అనుమతించలేదు. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల్లో ఎటువంటి మార్పులు ఉండవని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయానికి మతం రంగు పులవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
దీపావళి నాడు బాణాసంచా నిషేధం పై పూర్తిగా నిర్ణయం తీసుకోలేదని ప్రయోగాత్మకంగా ఒక ఏడాది బాణాసంచాను కాల్చడం ఆపితే దాని పరిణామాలు కాలుష్యంపై ఎంత మేరకు ఉంటాయనే దానిపై ప్రస్తుతానికి అధ్యాయనం చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. బాణాసంచా నిషేధాన్ని మతం తో ముడిపెట్టవద్దని న్యాయమూర్తి అన్నారు. తనకు ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువని అయితే దానికి తమ తీర్పుకి ఎటువంటి సంబంధం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *