బధిర విద్యార్థులకు దారా పౌండేషన్ ఆసరా

వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఆకాశం దాకా ఎదగవచ్చని ‘దారా’ ఫౌండేషన్ అధ్యక్షుడు డీ.ఎస్.ఆర్.కే. నెహ్రు అన్నారు. మలక్ పేటలోని భదిరుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైకల్యాన్ని జయించి ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మానసిక దృఢత్వమే మనిషిని ముందుకు తీసుకుని వెళ్తుందని చెప్పారు. సమాజంలో అవసరం ఉన్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. పరస్పర సహకారంతో ఎంతటి పని అయినా సులువుగా పూర్తి చేయవచ్చని చెప్పారు.
తమ సంస్థ ద్వారా ఈ పాఠశాలోని 85 మంది విద్యార్థులకు కావాల్సిన స్టేషనరీని అందచేస్తున్నట్టు వివరించారు. దీనితో పాటుగా ఒక లాప్ టాప్ ని అందచేశామని, సంవత్సరం పాటు కరెంటు బిల్లును తమ సంస్థ ద్వారా చెల్లించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రామచంద్ర రావు హాజరు కాగా, సంస్థ కార్యదర్శి వాసవి అరుణ్, కోశాధికారి శైలజ, పాఠశాల డైరెక్టర్ జానకి, మేఘన,రాజు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ కాలనీ చెందిన వయోధికులు కార్యక్రమానికి హాజరై నిర్వాహకులను అభినందించారు.కెనరా బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న మారితీ జోషి ఇంద్రజాల ప్రదర్శన విద్యార్థులతో పాటుగా సభికులను ఆకట్టుకుంది.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *