డీఎస్ కుమారుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

d.sanjay … టీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడిపై లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందాయి. శ్రీనివాస్ కుమారుడు డి. సంజయ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ నిజామాబాద్ జిల్లాలోని శాంకరి నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. సంజయ్ ఈ కళాశాలను నిర్వహిస్తున్నారని కళాశాలలోనే తమను ఆయన వేధిస్తున్నాడని హోంమంత్రికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.పీఓడబ్ల్యూ నేత సంధ్యతో కలిసి వచ్చిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులు హోంమంత్రి ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కళాశాలలోని తన రూంలో తనను కలవాల్సిందిగా సంజయ్ తమను వేధిస్తున్నాడని రూంలోకి పిలిపించుకుని అసభ్య చేష్టలు చేయడంతో పాటుగా అసభ్య పదజాలాన్ని వాడుతున్నాడని హోంమంత్రికి వారు ఫిర్యాదు చేశారు.
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తినస్తున్న డి.సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సంధ్య హోంమంత్రిని కోరారు. ఈ వ్యవారంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆమె కోరారు. విద్యార్థినులు చేసిన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరపాలని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి డీజీపీని కోరారు. ఈ వ్యవహారంలో సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థినుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకుంటారని హోంమంత్రి వారికి భరోసా ఇచ్చారు.
మొత్తం 11 మంది విద్యార్థినులపై సంజయ్ లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. వేధింపులను భరించలేక సదరు విద్యార్థినులు తమ ఇళ్లకు వెళ్లిపోయారని మహిళా సంఘం నేత సంధ్య చెప్తున్నారు. వారంతా పేదవారని నర్సింగ్ కోర్సు చదివితే వెంటనే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కాలేజీలో చేరిన వారిని వేధింపులకు గురిచేయడం దారుణమని అన్నారు. అంగబలం, ఆర్థ బలం పుష్కలంగా ఉన్నా డీఎస్ కుమారుల బారినుండి విద్యార్థినులను కాపాడాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఉన్న డీఎస్ కొన్నాళ్ల క్రితం ఆ పార్టీని వదిలి టీఆర్ఎస్ చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన తరువాత పార్టీతరపున రాజ్యసభకు వెళ్లిన డీఎస్ కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ జిల్లా నేతలతో కలిసి కేసీఆర్ కుమారై కవిత పార్టీ అధినేత కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది. డీఎస్ మరో కుమారుడు అరవింద్ బీజేపీ తీర్ఝం పుచ్చుకున్నారు.
d.srinivas, dharmapuri srinivas, trs, trs party, trs rajya sabha member, d.sanjay, d.srinivas son sanjay, shankari nursing college, nizamabad politics.

ఏపీలోని ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ బృతి


సినిమా ధియేటర్లపై అధికారుల దాడులు
D._Srinivas_