శరవేగంతో జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చూసిన కేంద్ర జలసంఘం ఫిదా అయింది. ప్రాజెక్టు నిర్మాణం పనులను గురించి తెలుసుకునేందుకు వచ్చిన జల సంఘం అధికారులు ప్రాజెక్టు పూరోగతిని తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరు భేష్ అంటూ మెచ్చుకున్నారు. ప్రాజెక్టు ప్రణాళికతో పాటుగా పనులు జరుగుతున్న తీరు, నిర్మాణాలు బాగున్నాయని వారు పేర్కొన్నారు. కేంద్ల జలసంఘం ఛైర్మన్ రాయ్, చీఫ్ ఇంజనీర్ సీకేఎల్ దాస్ తో పాటుగా పలువురు అధికారులు, నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును తెలుసునేందుకు వచ్చారు. క్షేత్ర స్థాయిలో ప్రయటించిన ఈ బృందం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అత్యత పకడ్బందీగా పనులు జరుగుతున్నాయంటూ ప్రశంసించారు. అనుకున్న సమయానికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాడానికి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను వారు అభినందించారు.