నంద్యాలలో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు ఇవే…

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రాభవాన్ని కోల్పోయింది. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీకి ఇప్పుడు కనీస గుర్తింపు లభించడం లేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిన పార్టీ తిరిగి పుంజుకునేందుకు చేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోసం ఏ మాత్రం చల్లారినట్టు కనిపించడం లేదు. నంద్యాలలో పోటీ చేయడం ద్వారా కనీసం ఉనికిని చాటాలకుని ఉబలాట పడ్డ కాంగ్రెస్ ఆశాల ఏ మాత్రం ఫలించ లేదు. నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అబ్దుల్ ఖాదిర్ కు కేవలం 1382 ఓట్లు మాత్రమే వచ్చాయి. నంద్యాలలో బలంగా ఉన్న ముస్లీం ఓటర్లను ఆకట్టుకునేందుకు గాను ఆ వర్గం అభ్యర్థిని రంగంలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఓ మోస్తరు ఓట్లను కూడా సాధించలేకపోయింది. కేవలం 13 వందల ఓట్లను సాదించి దారుణంగా దెబ్బతినింది.
ఎన్నికల ప్రచారం సమయంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తేలిపోయింది. గెలుపు పై ఎటువంటి ఆశలు లేకపోయినా కనీసం ఓ మోస్తరు ఓట్లను సాధించుకోవడం ద్వారా ఇంకా పార్టీ బతికే ఉందనే సంకేతాన్ని ఇద్దామనుకున్నా ఆ ఆశలు కూడా తీరలేదు. హస్తం పార్టీ నామమాత్రపు ఓట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *