రానున్నది మా ప్రభుత్వమే:ఉత్తమ్

0
74

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తమ పార్టీలోకి వస్తున్నారని, వచ్చిన వారంతా స్వచ్చంధంగా పార్టీలో చేరుకున్నారని చెప్పారు. టీఆర్ఎస్ లాగా తాము ఎవరినీ ప్రలోభాలకు గురిచేయడం లేదన్నారు. కాంగ్రెస్ ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రం ఏర్పడే నాటికి టీఆర్ఎస్ కు లోక్ సభలో ఉన్న బలం ఏమిటని ఉత్తం ప్రశ్నించారు. తెలంగాణ కేవలం తన ఘనత వల్లే వచ్చిందూ ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల బలిదానాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోదండరాం తెలంగాణ కోసం పోరటం చేయలేదా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని, నాడు సోనియాను దేవతగా కీర్తించిన కేసీఆర్ ఆ తరువాత మాటమార్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారిందన్నారు. ప్రాజెక్టుల డిజైన్లు మార్చడం ద్వారా వేలాది కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని కాజేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకునిపడ్డారు. ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుని తింటున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వపు చేతలతో ప్రజలు విసిగిపోయారని రానున్నది తమ ప్రభుత్వమేనని ఉత్తమ్ జోస్యం చెప్పారు.

Wanna Share it with loved ones?