కాంగ్రెస్ అభిమానులకు శుభవార్త

వరుస ఎదురుదెబ్బలతో దేశంలో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీకి, పార్టీ అభిమానులకు శుభవార్త. ప్రధాని నరేంద్ర మోడి సొంత రాష్ట్రం గుజరాత్ లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా బలం పెంచుకున్నట్టు తాజగా నిర్వహించిన సర్వేలో తేలింది. కమలం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోవడంతో పాటుగా కాంగ్రెస్ నుండి గట్టిపోటీని ఎదుర్కొంటున్నట్టు సర్వే ఫలితాల్లో తేలింది. గతంలో నిర్వహించిన సర్వే లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో కమలం పార్టీ నిల్చింది.
అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నట్టు తేలింది. ఇప్పటికీ బీజేపీ కాంగ్రెస్ కన్నా మెరుగ్గానే ఉన్నప్పటికీ గతంలో కంటే బీజేపీ బలం చాలా మేరకు తగ్గిందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. గత సర్వేలే కాంగ్రెస్ బీజేపీకి కనీసం పోటీ ఇచ్చే స్థాయిలోనే లేకుండా పోయింది. అయితే తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. గుజరాత్ తో నువ్వా నేనా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టిపోటీ ఇస్తోంది.
గుజరాత్ లో బలమైన సామాజిక వర్గం పాటేదార్లతో పాటుగా పలు కులసంఘాలు గతంలో బీజేపి కి మద్దతు పలక్కా ప్రస్తుతం అవి కాంగ్రెస్ కు జై కొడుతున్నాయి. దీనితో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. దీనితో పాటుగా అధికార బీజేపీ పై గుజరాత్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. సహజంగానే అధికార పార్టీపై ఉండే వ్యతిరేకత కూడా కాంగ్రెస్ బలం పెరగడానికి దోహదపడుతోంది.
గుజరాత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. త్వరోలనే కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలను పూర్తిగా తలకెత్తుకోనున్న రాహుల్ గాంధీ గుజరాత్ లో మకాం వేసి పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు కష్టపడుతున్నారు. పార్టీ పెద్దలు ప్రచార వ్యూహాన్ని మార్చడంతో పాటుగా బీజేపీ పై ఆగ్రహంతో ఉన్న వర్గాలను తమవైపుకు తిప్పుకునే క్రమంలో కాంగ్రెస్ కొంత వరకు సఫలం కాగలిగింది.
గుజరాత్ బీజేపీ నేతల్లో ఉన్న అసంతృప్తులు. నాయకుల మధ్య విభేదాలు కూడా కాంగ్రెస్ నాయకులకు వరంగా మారింది. కేవలం మోడీ ఛరిష్మా మీదనే బీజేపీ భవితవ్యం ఆధారపడి ఉంది. నాయకుల మధ్య కలహాలను తగ్గించేందుకు బీజేపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపించండం లేదు. తాజా సర్వే నేపధ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండింది.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *