ముస్లీం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ర్యాలీ

తెలంగాణలో ముస్లీంలకు వెంటనే 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ నేతలు చార్మినార్ నుండి గాందీభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ వెంటనే ముస్లీం రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా తో పాటుగా తెలంగాణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్లను అమలు చేయకుండా తప్పించుకుంటోందని, కేంద్ర ప్రభుత్వం నెపాన్ని నెట్టి పబ్బం గడుపుకుంటోందని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు.
రిజర్వేషన్లపై హామీ ఇచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రిజర్వేషన్ల నిర్ణయాన్ని ప్రకటించిందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముల్సీం మైనార్టీలకు చేసింది ఏమీ లేదని కేవలం మాటలు చెప్పి కాలం వెల్లదీస్తున్నారని వారు విమర్శించారు. మైనార్టీల రిజర్వేషన్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్దీ లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *