తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి…!

తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెలల్లో 50 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాలేజీలు పిల్లలను రోబోట్లుగా తయారు చేస్తున్నాయని వారిపై అనవసరమైన భారాన్ని మోపుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తప్పు కేవలం కాలేజీలదేనా… విద్యార్థుల ఆత్మహత్యలకు పూర్తిగా బాధ్యత కాలేజీలతేనా.. ఇందులో తల్లిదండ్రుల పాత్రేమీ లేదా… విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్న కాలేజీలే ప్రధాన ముద్దాయిలు అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ఇష్టా ఇస్ఠాలతో నిమిత్తం లేకుండా వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న సంగతి కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. పిల్లవాడు పుట్టీ పుట్టగానే వాడిని ఇంజనీరుగానో డాక్టరు గానో చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు వారికి ఉక్కుపాలతోనే వారు భవిష్యత్తులో సాధించాల్సిన ర్యాంకును గురించి నూరిపోస్తున్నారు. డాక్టరు లేదా ఇంజనీరో కాకుంటే ఇక జీవితం ఎందుకు కొరగానిదై పోతుందని చెప్తు వాళ్లని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. పిల్లలుపై కన్న వాళ్లు ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదు కానీ వారు భారం మోయగలరో లేదో కూడా తెలుసుకోకుండా వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడంతో భారి పౌరుల జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి.
మీ పిల్లలను డాక్టర్లు, ఇంనీర్లుగానో తయారు చేసే బాధ్యత మాదీ అంటూ వారి భారాన్ని నెత్తిన వేసుకుంటున్న కార్పోరేట్ కాలేజీలు వారిని బట్టీ యంత్రాలుగా మారుస్తున్నాయి. కేవలం ర్యాంకులే పరమావధిగా చదువులు చెప్తూ వారిపై ఎక్కడ లేని ఒత్తిడిని తీసుకుని వస్తున్నాయి. రోజుకో రకం టెస్టుల పేరుతో హింసలు పెడుతూ మార్కులు తక్కువగా వస్తే అందరి ముందు పరువు తీయడం.. మార్కులు రాకపోతే జీవితంగా ఎందుకూ పనికిరారంటూ చేస్తున్న వ్యాఖ్యలతో విద్యార్థులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు.
చిన్నతనం నుండి తమకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా నిలబడే తల్లిదండ్రులు చదువు విషయానికి వచ్చేసరికి విద్యార్థులకు ఎటువంటి మద్దతు ఇవ్వడం లేదు. దీనితో అటు కాలేజీల నుండి ఎదురవుతున్న ఒత్తిడితో పాటుగా కుటుంబం నుండి సహకారం లభించక విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కేవలం చదువే లోకంగా బతుకుతున్న విద్యార్థులకు సాంత్వన చేకూర్చాలిన అవసరం తల్లిదండ్రులపై కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *