కోడిపందాల జోరు-చేతులు మారుతున్న కోట్లు

ఉభయగోదావరి జిల్లాల్లో కోళ్లపందాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కోళ్లపందాలకు కేరప్ ఆడ్రస్ గా చెప్పుకునే పశ్చిమ గోదావరిలో కోళ్లపందాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి చేరుకున్నారు. కోళ్లపందాలకు అనుమతి లేదంటూ పోలీసులు కొద్దిగా హడావుడి చేసినప్పటికీ వాటిని ఆపడం పోలీసులకు సాధ్యం కాలేదు. చూసిచూడనట్టుగా పోవాలంటే వచ్చిన మౌఖిక ఆదేశాలతో పోలీసులు మౌనం దాల్చడం తో పదెం రాయుళ్లు రెచ్చిపోయారు. పశ్చిమ గోదవారిలో దాదాపుగా 150కి పైగా పెద్ద బరుల్లో పోటీలు జరుగుతున్నాయి. ఇక చిన్న చిన్న బరులకైతే లెక్కేలేదు. పందెం సందర్భంగా కోట్లది రూపాయలు చేతులు మారుతున్నాయి.
పదెం కోళ్లకు కత్తులు కట్టడాన్ని నిషేధించినప్పటికీ యదేచ్చగా కోళ్ల కాళ్లకు కత్తులు కట్టిమరీ పందాలను నిర్వహించారు. హైదరాబాద్ తో పాటుగా పలు ప్రాంతాల నుండి బడాబాబులు కోట్లాది రూపాయల మేర పందాలు కాసినట్టు తెలుస్తోంది. పందాలు, పై పందాలతో కోట్లాది రూపాయల మేరకు పందాలు జరుగుతున్నాయి. కోళ్ల పందాలు జరుగుతున్న ప్రాంతాల్లో మధ్యం ఏరలై పారుతోంది.
పెద్ద సంఖ్యలో మహిళలు సైతం కోళ్ల పందాల్లో పాల్గొనడం విశేషం. పెద్ద నోట్ల రద్దు వల్ల గత సంవత్సరం కోళ్ల పందాలు కొద్దిగా తగ్గినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ఊపందుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *