కోళ్ల పందాలకు హైకోర్టు బ్రేక్

కోళ్ల పందాలపై రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. కోళ్ల పందాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కోళ్ల పందాల వల్ల జంతుహింస జరుగుతోందని, పెద్ద ఎత్తున పందాలు కాయడం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని అంటూ హైకోర్టును ఆశ్రయించగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కోళ్ల పందాలను నిషేదిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కోళ్ల పందాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా తూర్ప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు భారీ ఎత్తున జరుగుతాయి. ఈ కోళ్ల పందాలను ఆడడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుండి పందెపు రాయుళ్లు ఈ రెండు జిల్లాల్లో మకాం వేస్తుంటారు. సంక్రాంతి మూడు రోజులు వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. రకరకాల పందాలతో పై పందాలతో రెండు జిల్లాల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. గత ఏదాడి కూడా కోళ్ల పందాలపై హైకోర్టు నిషేధం విధించగా దీన్ని సవాలు చేస్తూ సూప్రీం కోర్టు నుండి పందెపు రాయుళ్లు స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరు తిరిగి సుప్రీం కోర్టుకు వెళతారా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలితే పందెపు రాయుళ్లు పందాలను ఆపుతారా అన్నది చూడాల్సిందే. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ దొంగచాటుగా పందాలను నిర్వహించడం దానికి ప్రజాప్రతినిధులు సైతం హాజరు కావడం ఇక్కడ మామాలే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *