మొదలైన కోళ్ల పందాలు-చర్యలు తప్పవంటున్న పోలీసులు

సంక్రాతి సందర్భంగా కోళ్ల పందాలు మొదలయ్యాయి. పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా పలు చోట్ల గుట్టుచప్పుడు కాకుండా పందాలు జరుపుకుంటున్నారు. కోళ్ల పందాలను నిషేధిస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చాటుమాటుగా ఈ వ్యవహారంలో జరుగుతోంది. కొన్ని చోట్ల బహిరంగంగానే కోళ్లపందాలను జరుపుతున్నారు. డింకీ పందాలకు కోర్టు అనుమతి ఉందంటూ ప్రచారం చేస్తున్న కొంతమంది పొలాల్లో పందాలాడుతున్నారు. పందెం రాయుళ్లకు రాజకీయ నేతలు అండదండలు పుష్కలంగా ఉండడంతో చాలా చోట్ల పోలీసులు చూసిచూడనట్టుగానే ఉన్నారు. కోళ్లపందాలు అక్కడక్కడా జరుగుతున్నా ఇంకా వాటి ఊపు పెరగలేదు.
మరోవైపు కోళ్ల పందాలు ఆడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి పందాలకు అనుమతి లేదని అంటున్నారు. కొంతమంది ప్రచారం చేస్తున్నట్టుగా డింకీ పందాలకు కూడా అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. కోళ్లపందాలు ఎవరు ఆడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పందాలకు స్థలాలను ఇచ్చేవారిపై చర్యలు తీసుకుంటాని చెప్తున్నారు. సంప్రదాయ ముసుగులో జూదానికి దిగితే సహించేది లేదంటున్నారు. కోళ్లపందాలపై కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పిన పోలీసులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *