మార్చి 2నుండి సినిమా ధియేటర్లు బంద్

0
64

వేసవిలో సినిమాలకు ప్రేక్షకులు దూరం కాబోతున్నారా? దక్షిణాది రాష్ట్రాల సినీ నిర్మాతల జేఏసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే ప్రస్తుతానికి మార్చి 2వ తేదీ నుండి సినిమాల ప్రదర్శన ఉండబోదు. సినిమాల్లో రీళ్ల ద్వారా ప్రదర్శించే పద్దతికి స్వస్తిచెప్పి పూర్తిగా డిజిటల్ రూపం సంతరించుకున్న తరువాత ముఖ్యంగా మూడు ప్రధాన కంపెనీలు సినిమాలను డిజిటల్ రూపంలో ప్రదర్శిస్తున్నాయి. క్యూబ్,యూఎఫ్ వో, పి ఎక్స్ డీ లాంటి సంస్థలు సినిమా హాళ్లలో డిజిటల్ రూపంలో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమాలను ప్రదర్శించే సమయంలో వసూలు చేస్తున్న ఛార్జీలు అధికంగా ఉన్నాయనేది సినీ నిర్మాతల అభ్యంతరం దీనిపై ఆయా సంస్థల ప్రతినిదులతో బెంగళూరులో జరిపిన సంప్రదింపులు విఫలం కావడంతో మార్చి 2వ తేదీ నుండి సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గించడంతో పాటుగా మూడు ప్రదాన డిమాండ్లను నిర్మాతల జేఏసీ క్యూబ్ సంస్థ ప్రతినిధులతో చర్చించింది. ఛార్జీలను తగ్గించడంతో పాటుగా సినిమాల మధ్యలో వేస్తున్న ప్రకటనల సమాయాన్ని ఎనిమిది నిమిషాలకు తగ్గించాలని, రెండు సినిమా ట్రైలర్లను ఉచితంగా ప్రదర్శించాలని నిర్మాత జేఏసీ చేసిన డిమాండ్లను క్యూబ్ తోసిపుచ్చింది. గతంలో ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పి ధియోటర్లను డిజిచలైజేషన్ చేసిన తరువాత ఇప్పుడు మాట మార్చి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేయడం పట్ల నిర్మాతల జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికైతే మార్చి 2నుండి సినిమాల ప్రదర్శను నిలిపివేయాలని నిర్ణయించామని తదుపరి కార్యాచరణనను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతల జేఏసీ ప్రకటించింది.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here