డ్రైనేజీలోకి దిగిన ఏడుగురు మృతి

0
48

ఓ కోళ్ళఫారంలో ఉన్న భుగర్భ వ్యర్థాలను శుబ్రం చేసేందుకు డ్రైనేజీలోకి దిగిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని మెరం గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉన్న వేంకటేశ్వర హెచరీస్ లో భూగర్భ డ్రైనేజీలోని వ్యవర్థాలను తొలగించేందుకు ఏడుగురు కార్మికులకు కర్మాగార యాజమాన్యం పనికి పిలిచింది. డ్రైనేజీలోకి దిగిన నలుగురు ఊపిరి ఆడగక అక్కడే పడిపోగా వారిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా భూగర్భంలో స్పృహ కోల్పోయారు. దీనితో గ్రామస్థులు డ్రైనేజీ పైన ఉన్న సిమెంట్ దిమ్మలను తొలగించి కొన ఊపిరితో ఉన్న ఏడుగురుని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండానే నలుగురు చనిపోగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొంందుతూ మృత్యువాత పడ్డారు.
డ్రైనేజీలోకి వచ్చే వ్యవర్థాలలో రసాయనాలు కలవడం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఏకే ప్రమాదంలో ఏడుగురు చనిపోవడంతో స్థానికంగా విషాధ ఛాయలు అలముకున్నాయి. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here