భారత్ కు చైనా హెచ్చరికలు |china warns india

0
96

భారత్ కు చైనా హెచ్చరికలు చేసింది. తమ భూబాగాన్ని అంగుళం కూడా వదిలిపెట్టబోమని దీనికోసం అవసరం అయితే యుద్ధానికి కూడా సిద్ధమేనని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించారు. జీవితకాలం అధ్యక్షహోదాలో కొనసాగేలా చట్టసవరణ చేసిన తరువాత చైనా పార్లమెంటు ముగింపురోజున దేశప్రజలను ఉద్దేశించి జిన్ పింగ్ మాట్లాడారు. దేశ సార్వభౌమత్వవిషయంలో రాజీపడేది లేదని చైనా అధ్యక్షుడు పేర్కొన్నాడు. చైనాకు చెందిన అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని దీనికోసం గాను అవసరం అయితే యుద్ధానికి కూడా దిగుతామని హెచ్చరికు చేశారు.
భారత్ తో పాటుగా చైనాకు ప్రపంచంలోని పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి. హింధు మహాసముద్రంలోనూ తన ఆధిపత్యంకోసం చైనా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ సముద్రపు జలాలను తమ అదుపులో పెట్టుకోవడం ద్వారా ప్రపంచదేశాలను తమ గుప్పిటపెట్టుకునే ప్రయత్నం చేస్తున్న చైనా మరింత దూకుడును ప్రదర్శిస్తోంది.
తన వస్తువులను ప్రపంచమార్కెట్ ను ముంచెత్తడం ద్వారా ఉత్పత్తిరంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా ఇప్పుడు తన సైనిక బలాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నాలు చేస్తూ బెరిదింపులకు దిగుతోంది. యుద్ధ ప్రకటనలు చేయడం ద్వారా అవసరం అయితే ఎంతకైనా తెగిస్తానని చైనా చెప్పకనే చెప్పింది.
China warned India not to harbour any illusions about the china military’s ability to defend its territory amid the simmering border. china, India, zing pin,china warns india,


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here