నగ్నపూజ…నరబలి…-నగరం నడిబొడ్డున అరాచకం

0
52

గ్రహణం రోజున క్షుద్రపూజలు చేస్తే అతీత శక్తులు వస్తాయనే మూఢ నమ్మకం… ప్రజల భయాలను తమకు అనుకూలంగా మార్చుకునే మంత్రగాళ్ల మాటలు… వెరసి ఓ చిన్నారి జీవితాన్ని చిద్రం చేశాయి. గ్రహణం రోజున నరబలి ఇస్తే కోరిన కోరికలు తీరతాయనే వెర్రితో ఒక చిన్నారని అత్యంత దారుణంగా నరికి చంపిన వైనమిది. చిలకానగర్ లో పదిహేను రోజుల క్రితం దొరికిన చిన్నారి తలకు సంబంధించి పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.ఎన్నిరకాలుగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ మూఢవిశ్వాసాలు వదలడం లేదు. నరబలి ఇస్తే తన భార్య ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా ఆర్థికంగా మేలు జరుగుతుందని భావించిన రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ మూడు నెలల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు.
రాజశేఖర్ కు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ దానికి తగినట్టుగానే అతని భార్యకు కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలు వేధిస్తుండడంతో పాటుగా ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో వాటినుండి బయట పడేందుకు తాంత్రికులను ఆశ్రయించడాడు. వారితో పాటుగా ఇటీవల రాజశేఖర్ ఇంటికి వచ్చిన ఒకర బంధువుకు పూనకం రావడం తనకు నరబలి ఇస్తే శాంతిస్తానని అన్నట్టు తెలుస్తోంది. దీనితో గ్రహణం రోజున నరబలి ఇస్తే సమస్యలు తీరతాయనే నిర్ణయానికి వచ్చిన రాజశేఖర్ బోయిగూడ వద్ద నుండి మూడు నెలల చిన్నారిని అపహరించాడు. ఆ చిన్నారి ఎవరూ అనేది ఇప్పటికీ పోలీసులకు అంతుచిక్కలేదు. రోడ్డుపై పడుకున్న వారివద్దనుండి బిడ్డను అపహరించినట్టు రాజశేఖర్ చెప్తున్నా బిడ్డను పోగొట్టుకున్న వారు పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదనే విషయం ఇంకా మిస్టరీగానే ఉంది. చిన్నారిని అపహరించిన వ్యక్తి ప్రతాప సింగారం వద్ద నరబలి ఇచ్చి మొండాన్ని అక్కడే మూసీలో పారేసి తలను మాత్రం తీసుకుని వచ్చాడు. తలను ముందు పెట్టుకుని క్షుద్రపూజలు నిర్హవించినట్టు తెలుస్తోంది.
రాజశేఖర్ దంపతులు పూర్తి నగ్నంగా పూజలు నిర్వహించారని పోలీసులు చెప్తున్నారు. వీరిద్దరితో పాటుగా మరో ముగ్గురు మహిళలు సైతం పూజలో పాల్గొన్నారు. పూజల అనంతరం చిన్నారి తలను మిద్దమీద చంద్రుడి కాంతి పడే విధంగా ఉంచి తెల్లవారిని తరువాత పూజల ఆనవాళ్లు పూర్తిగా చెరిపేశారని పోలీసులు చెప్తున్నారు.
రాజశేఖర్ దంపతుల వికృత చర్యలకు కరణాలు అనేకం కనిపిస్తున్నాయి. అనాగరిక ఛాయలు ఇంకా మమల్ని వీడలేదు. అచారం ముసుగులో కొన్ని. నమ్మకాల పేరిట మరకొన్ని దారుణాలకు తెగబడుతూనే ఉన్నాం. దేవుడి పేరుతో జరుగుతున్న అజ్ఞానాలకు అంతుపొంతూ లేకుండా పోయింది. పిచ్చి నమ్మకాలను ప్రోత్సహించేవారికి కొదవే లేకుండా పోయింది. శాస్త్ర సాంకేతికతతో పాటుగా మూఢాచారాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here