చిన్నారులతో పోర్న్ వీడియోలు-యూపీలో దారుణం

అశ్లీల వీడియోలు తీస్తూ డబ్బులు దండుకుంటున్న ముఠాలు మరీ బరితెగించాయి. చిన్న పిల్లలతో అశ్లీల వీడియోలు తీస్తున్న ఒక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. వాట్సప్ గ్రూప్ వేదికగా ఈ తతంగం జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు ఈ దారుణాలకు తెగబడుతున్న వారిని అరెస్టు చేశారు. వాట్స్ ప్ గ్రూప్ లే వేదికగా చేసుకుని చిన్నారుల పోర్న్ వీడియోలను, ఫొటోలను షేర్ చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వాట్సప్ గ్రూప్ లో 18 దేశాలకు చెందిన 100 మంది సభ్యులు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు.
తమకు అందిన సమాచారం మేరకు కొన్ని రోజుల పాటుగా నిఘా ఉంచిన తరువాత వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నోజ్ ప్రాంతానికి వ్యక్తి ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకున్న పోలీసులు దోషులపై కఠిన సేక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. అంతర్జాతీయంగా ఇప్పుడు చిన్నారు పోర్న్ పెద్ద సమస్యగా మారింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *