చెన్నైకి అతిభారీ వర్ష సూచన

రానున్న 24 గంటల్లో చెన్నైతో పాటుగా తమిళనాడులోని మరిన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం చెన్నైలో భారీ వర్షం కురిసింది. మరో 24 గంటలకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడులోని తీర ప్రాంతాలతో పాటుగా పుదుచ్చేరిలోనూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీలంకకు సమీపంలో ఏర్పడిని అధిక పీడనం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని మరో 5 రోజుల పాటు ఇదే తరహా పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై, కడలూరు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, నాగపట్టణం, తంజావూర్‌, తిరువారూర్‌, రామనాథపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముఖ్యంగా చెన్నై నగరంలో ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మరో వైపు భారీ వర్షలంటేనే చెన్నై వాసులు బెంబేలెత్తుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *