పవన్ కళ్యాణ్ పై బాబు ఫైర్|chandrababu fire on pk

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శల జోరును మరింతగా పెంచారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నిమిషాకో మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. గతంలో ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అన్న పవన్ ఇప్పుడు హోదా అవసరం లేదు నిధులు చాలు అంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఉదయం ఒక మాట మాట్లాడే పవన్ మధ్యాహ్నానికి మరొకటి రాత్రికి ఇంకోటి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లోకేశ్ పై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ దానికి అధారాలు లేవని ఒకసారి అన్నీ ఆధారాలు ఉన్నాయని మరోసారి అంటున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.
రాష్ట్రానికి మంచిజరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తుపెట్టున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదిగో అదిగో అంటూ నాలుగు సంవత్సరాలపాటు ఎదురుచూశామని అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చజరక్కుండా బీజేపీ కుయుక్తులు పన్నుతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను పనిచేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ లు మాత్రం తనపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోడీతో కుమ్మక్కయిన వీళ్లు రాష్ట్ర ప్రయోజనాలకు ఢిల్లీలో తాకట్టు పెట్టారని తీవ్రంగా విమర్శించారు.
andhra pradesh, andhra, ap, chandra babu naidu, chandrababu, narendra modi, chandrababu naidu ap cm, pawan kalyan, chandra babu naidu serious, special status, special status for andhra pradesh, bjp government, central government, chandra babu fires on janasena, janasena, janasena party,Chandrababu Naidu alleged Pawan Kalyan has become a BJP Covert,Both Pawan and Jagan are BJP’s Coverts says chandra babu.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *