కేంద్రంతో దోస్తీ కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం:బాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం స్పిల్ వే టెండర్లను ఆపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేశాయి. ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సహాయం చేయబోమని కేంద్రం చెప్తే నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలవరం పనులను కేంద్రానికే అప్పగించి వారినే పూర్తిచేయమని చెప్తామన్నారు. అత్యంత కీలకమైన స్పిల్ వే టెండర్లను అపేయమంటే ఆపేస్తామని చంద్రబాబు చెప్పారు.
తాను ఆశావద దృక్పధంతో ఉంటానని ఏ విషయమైనా ఆఖరి నిమిషం దాగా పోరాటం చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. అవసరం అయితే ఎవరిపైనైనా పోరాటానికి సిద్దమన్నారు. పోలవరం విషయంలో సమస్య ఎక్కడ ఉందో తనకు అర్థం కావడం లేదన్నారు. దీనిపై ప్రధానితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం అడిగాన్నారు. విపక్షాలు ముందుకు వస్తే వారిని కూడా తీసుకుని ఢిల్లీ వేళ్తాన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
అన్ని విషయాల్లోనూ అవకాశవాద రాజకీయాలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు. అయితే ప్రజల కోసం ఎటువంటి పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటాన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *