చంద్రబాబును చుట్టుముట్టిన సమస్యలు

0
107

తెలుగుదేశం పార్టీకి ఒక్కసారిగా తలనొప్పులు ఎక్కువయ్యాయి. కొంతకాలం దాకా అనుకూలంగా ఉన్నవారంతా ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. మిత్రపక్షం బీజేపీ దూరం అయింది. ఆపదసమయాల్లో ఆదుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై చేసిన ఆరోపణలు సాధరమైనవేమీ కాదు. అధినేత చంద్రబాబు నాయుడితో పాటుగా ఆయన తనయుడు లోకేశ్ బాబు పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దోచుకుని తింటాడంతూ ఇన్నాళ్లు చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు గట్టిగానే తగిలాయి.
ప్రభుత్వ విధానాలను విమర్శించడం ఒక ఎత్తయితే నేరుగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ బాబుల అవినీతిని అంశాలను ప్రస్తావించడం ద్వారా పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో టీడీపీపై గట్టి పోరాటానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వైసీపీని, కేంద్రాన్ని విమర్శించినా ఎక్కువ సమయం చంద్రబాబు,లోకేశ్ లపైనే పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు బీజేపీ, జనసేన గట్టిమద్దతు ఇచ్చాయి. వాటివల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని చెప్పలేము కానీ వారి మద్దతు చంద్రబాబుకు చాలానే ఉపయోగపడింది. గత నాలుగు సంవత్సరాల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా చంద్రబాబుపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. అడపదడపా విమర్శలు గుప్పించినా పాలనా వ్యవహాలకు సంబంధించినవి తప్ప వ్యక్తిగత ఆరోపణలకు దిగలేదు. తాాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై విరుచుకునిపడిన తీరును బట్టి రానున్న కాలంలో ఆయన టీడీపీకి మద్దతు పలికే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీకి దూరమయిన టీడీపీకి ఇది మరోఎదురుదెబ్బే. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిపోరాటం చేయకతప్పదు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here