ఘట్కేసర్ లో చడ్డీ గ్యాంగ్ ఆనవాళ్లు…

నగర శివార్లలో చడ్డీ గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మియాపూర్ లో ప్రమాదకర చడ్డీ గ్యాంగ్ సంచరించిన దృశ్యాలు సీసీ కెమేరాలకు చిక్కగా తాజాగా ఘట్కేసర్ వద్ద కూడా చడ్డీ గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు వణికిపోతున్నారు. అత్యంత ప్రమామకరంగా చెప్పుకునే చెడ్డీ గ్యాంగ్ ముఠా దొంగతనాల్లో ఆరితేరింది. ఉదయం పూట బిచ్చగాళ్ల మాదిరిగానూ, చిరు వ్యాపారులుగానూ రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే ఈ ముఠ అడ్డు వచ్చిన వారిపై దాడిచేసేందుకు వెనుకాడరు. దొంతనానికి బయలు దేరే సమయంలోనే మారణ ఆయుధాలు తెచ్చుకునే ఈ ముఠా అవసరం అయితే దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని హతమార్చేందుకు సైతం వెనుకాడరు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడే ఈ కరుడుగట్టిన ముఠాలు దొంగతనాలు చేయడమే ప్రధాన వృత్తి. ఒక్కో ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ దొంగతనాలకు పాల్పడి తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతుంటారు. వీరిని పట్టుకోవడం కూడా పోలీసులకు సవాల్ గా మారింది.