స్కూల్ సీజ్ – విద్యార్థుల్లో ఆందోళన

0
2
సెంచరీ పబ్లిక్ స్కూల్

century public school … కూకట్ పల్లిలోని న్యూసెంచరీ పబ్లిక్ స్కూల్ ను అధికారులు సీజ్ చేశారు. గురువారం ఈ పాఠాశాల గ్రౌండ్ లో ఉన్న స్టేజీ పైకప్పు కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా మారో ఐదురుగు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జీహెచ్ఎంసీ అధికారులు పాఠశాల భవనాన్ని సీజ్ చేశారు. సరైన నిర్వహణ లేకపోవడం, పై కప్పు బలహీనంగా ఉండడంతో అది కూలిపోయిందని జీహెచ్ ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇటు పాఠాశాల భవనం నాణ్యతకూడా సరిగా లేకపోవడంతో దాన్ని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. పాఠాశాలను సీజ్ చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నార. విద్యాసంవత్సరం మధ్యలో పాఠాశాలను మూసివేయడం వల్ల తమ పిల్లల చదువు ఏమవుతుందోనని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల వద్ద ఆందోళన వెలిబుచ్చారు. పాఠాశాలను సీజ్ చేయడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే తమ పిల్లల భవిష్యత్తుపై బెంగపడుతున్నట్టు వారు చెప్తున్నారు. పాఠాశాల స్టేజీ పై కప్పు కూలిపోయిన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారు మరణించడం కలచివేస్తోందని, పాఠాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఈ స్కూల్ లో 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో స్థానికంగా మంచిపేరు సంపాదించుకున్న ఈ స్కూల్ నిర్వహణ క్రమంగా గాడితప్పిందని స్థానికులు చెప్తున్నారు. ఒకప్పుడు 500 మందికి పైగా విద్యార్థులు ఉన్న ఈ స్కూల్ లో క్రమంలో వారి తగ్గుతూ వచ్చిందని ఇప్పుడు కేవలం 160 మంది మాత్రమే చదువుతున్నారని వారు చెప్పారు. యాజమాన్యం పాఠశాలను సరిగా పట్టించుకోకపోడం వల్లే ఈ దారుణం జరిగిందని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు పోయాయని వారు పేర్కొన్నారు.
జీహెచ్ ఎంసీ అధికారులతో పాటుగా ఇటు విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలను సందర్శించారు. ఒక్కసారిగా పాఠశాల మూతపడడంతో ఇందులో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా చూస్తామని విద్యాశాఖాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠాశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారని విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాలను మూసివేయడం వల్ల వారు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానికుంగా ఉన్న పాఠాశాలల్లో వీరికి ప్రవేశం కల్పించడంతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా చూస్తామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇచ్చారు. పాఠశాల అనుమతికి సంబంధించిన విషయంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై ఖచ్చితంగా చర్యతీసుకుంటామని మేడ్చల్‌ సంయుక్త కలెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. పాఠశాలలను సందర్శించిన ఆయన జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరిపిస్తామని ప్రస్తుతం ఈ పాఠాశాలలో చదువుతున్న విద్యార్థులను వేరే పాఠాశాలలో అడ్మిషన్లు ఇప్పిస్తామన్నారు.
century public school, kukatpally school, kukatpally school building collapse, kukatpally school.

డీఎస్ కుమారుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు


తిరుమల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల | ttd seva online

Wanna Share it with loved ones?