‘ఐరన్ విల్లా ‘
పి.సుధా మారుతి
నా వేసవి శెలవులన్నీ మా అమ్మమ్మ తాతగారి ఇంటిలోనే గడిచిపోయాయి. వేసవి శెలవలు ఎప్పుడొస్తాయా అని “చెకోర పక్షిలాగా ఎదురు” చూసేదాన్ని ఎందుకంటే అప్పటి వరకు నిశ్శబ్ధంగా ఉన్న మా ఇల్లు మా పిన్నీ, మామయ్యల పిల్లల రాకతో విరగ కాసిన మామిడి చెట్టు పై వాలిన చిలకల గంపులా కిలకిలలాడుతుండేది.
ఎండాకాలం శెలవులో నాకు మూడు కార్యక్రమాలు ‘మేండెటరీగా’ వుండేవి.
ఒకటి మా పెద్ద తమ్ముడితో కలిసి మేడమీద రెండు నవారు మంచాలు నిలబెట్టి వాటి పై పక్కింటి కొబ్బరాకులను గోడమీదుగా దొంగతనంగా తుంపి తెచ్చి “సమ్మర్ టెంట్” తయారు చేయడం, మిట్ట మద్యాహ్నం ఆ టెంటు క్రింది తాటిముంజలు తింటూ, వేడి కళ్లతో ఎంత తీక్షణంగా చూస్తున్నా నన్ను చూసి ఈ పిల్లలు ఝడవటం లేదని సూర్యుడు అలిగేవాడు.
రెండవది ప్రతిరాత్రి ఆరుబయట అమ్మచుట్టూరా డజను మంది పిల్లలు కూర్చొని కొత్త అవకాయ అన్నం తిరుపతి లడ్డూలంత ముద్దలు వెన్నెలను నంజుకొంటూ తినడం.
మూడవది మా ఇంటికి వచ్చిన ప్రతి చుట్టానికి పాలేరమ్మగుడి వెనక నల్లరాతి గోడలతో ఠీవిగా నిలబడ్డ ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి “ఐరెన్ విల్లా” చూపించడం ఆయన అక్కడ ఉన్నట్టు మేం ఆయన సమకాలికులమైనట్లు ఊహలలో తేలిపోవడం. ఆ యింటి గురించి మేం విన్నవి ఊహించినవి కలగలపి ఊరించే కబుర్లు వాళ్లుకు చెప్పడం తప్పనిసరి.
మా తరువాత తరానికి కూడా “ఐరన్ విల్లా” ను చూపించాలన్న నా అత్యాశతో పిల్లల్ని తీసుకుని రంగారాయుడి చెరువు మీదగా “ఐరన్ విల్లా” కోసం వెళ్లాను … నాకు తెలియకుండానే ధారాపాతంగా కురుస్తున్న కన్నీళ్లు బుగ్గల మీదుగా జారిపోతున్నాయి.
కారణం ఇప్పుడక్కడ బ్రిటిష్ దొరల గుండుకెదురుగా గుండెనిలిపిన ఆంధ్ర కేసరి గారు కట్టింటిన “ఐరన్ విల్లా” స్థానంలో ఒక ప్రైవేటు కళాశాల బహుళ అంతస్థుల భవనం మసకగా కనిపించింది. తీరని ధఃఖాన్ని మూటగట్టుకొని నడుస్తుండగా ఒక పిల్ల తెమ్మెరలాంటి వార్త ప్రఖ్యాత చిత్రకారులు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావుగారి చేతులలో “ఐరెన్ విల్లా” తైలవర్ణ చిత్రంగా రూపుదిద్దుకుందని మా మామయ్య ద్వారా తెలిసింది. వెంటనే వారి ఇంటికి దారితీశాను. నా తరువాత తరంకూడా “ఐరెన్ విల్లా” ను తమ చుట్టాలకు చూపింది. కాకపోతే ఒక అందమైన తైలవర్ణ చిత్రంగా….
(మీరు కలం కదిలించండి మీ రచనలకు wwww.telanganaheadlines.in సాహిత్యం పేజీ ఆహ్వానం పలుకుతోంది. మీ రచనలకు మాకు www.telanganaheadlines@gmail.com మేయిల్ చేయండి. పోస్టు ద్వారా పంపాలనుకునేవారు Editor, Telanganahadlines, h.no 11-88, “saptagiri” , p&t colony, Dilsukhnagar, Hyderabad.500060. అనే చిరునామాకు పంపవచ్చు.)

ఇదే స్పూర్తి,దీక్షతో భాషోధ్యమానికి కంకణ బద్దులం కావాలి

(డాక్టర్ బీ.ఎల్.ప్రసూన, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు) ప్రపంచ తెలుగు మహాసభలు నభూతో అన్నట్టుగా జరిగాయి. తెలుగుపై ఉన్న మమకారాన్ని తట్టిలేపేలా జరిగిన…

కవి పండితులారా మెల్కోండి…

తెలుగు భాష కేవలం కావ్య భాష కాదు అది చైతన్య స్రవంతి. తెలుగు భాషలోకి ఎన్నో పదాలు వచ్చి చేరితే మరెన్నో…

తెలుగు వెలుగులు…

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మన తెలుగు భాష తీయదనాన్ని, గొప్పతనాన్ని చాటడానికి ఉద్దేశించిన ఈ సభలను ప్రతిష్టాత్మకంగా…

సహజ కవి పోతన…

పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా! తెలుగు నేలలో ఈ పధ్యం రానివారి…

తెలంగాణ జానపద గేయాలు

” “ఆత్మ లను పలికించెది అసలైన భాష- ఆ విలువ కరువైపోతె అది కంఠసొష” అని డాక్టర్ సి. నారాయణ రెడ్డి…