ఎంపీ మురళీమోహన్ కేసు నమోదు

0
83

హైటెక్ సిటీ దగ్గర దొరికిన రూ.2 కోట్ల డబ్బు వ్యవహారంలో ఎంపీ మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేశామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. వీరిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలకు నిమ్మలూరి శ్రీహరి, పండరి అనే ఇద్దరు వ్యక్తులు హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో అనుమానస్పదంగా కనిపించారు. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 2 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టగా జయభేరి ఉద్యోగులు జగన్మోహన్‌, ధర్మరాజులు వారికి డబ్బు ఇచ్చినట్టు నిందితులు తెలిపారు. ఈ డబ్బు కోసం యలమంచిలి మురళీకృష్ణ, మురళీమోహన్‌ రాజమండ్రిలో ఎదురుచూస్తుంటారని కూడా పేర్కొన్నారు. హైటెక్‌ సిటీ నుంచి సికింద్రాబాద్‌, అక్కడి నుంచి గరీబ్‌రథ్‌ ట్రైన్‌లో రాజమండ్రికి తరలించేందుకు నిందితులు యత్నించారు. రెండు కోట్ల రూపాయల మొత్తం జయభేరీ సంస్థకు చెందినవేనని నిర్ధారించినట్లు సజ్జన్నార్ తెలిపారు.

Wanna Share it with loved ones?