బ్రాహ్మణ పరిషత్ లోన్లపై స్పష్టత కరువు | Brahmin Parishad

0
138
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్
తెలంగాణ బ్రాహ్మణ పరిషత్

తెలంగాణలోని బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటయిన తెలంగాణ బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా వివిధ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి సహాయం లభించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిషత్ ద్వారా వ్యాపారాలు, ఉన్నత, విదేశీ చదువుల కోసం సహాయం అందాల్సి ఉండగా నిధులు మాత్రం విడుదల కావడం లేదు
కొంత మంది వ్యాపారులకు రుణాలు మంజూరు అయినట్టు దృవీకరణ పత్రాలు అందచేసినప్పటికీ వారికి ఇంకా లోన్లు మంజూరు కాలేదు. దీనిపై తమకు ఎటువంటి సమాచారం అందడం లేదని వారు వాపోతున్నారు. బ్రాహ్మణ పరిషత్ కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమకు మాత్రం సహాయం అందడంలేదనేది అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ అవి లబ్ధిదారులకో చేరడం లేదని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ కృష్ణమోహన్ చెప్పారు. బ్రాహ్మణుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ వాటివల్ల ఆశించిన ఫలితాలు దక్కడంలేదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి బ్రాహ్మణుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నా ఫలితం కనపించడంలేదని దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వనట్టుగా ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ నుండి ఎటువంటి నిధులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వివిధ పథకాల కింద రుణాలకోసం దరఖాస్తు చేసుకున్న వారికి సరైన సమాచారం అందడంలేదని ఆయన పేర్కొన్నారు. రుణాలు ఎప్పుడు అందుతాయి. అనే విషయానికి సంబంధించి ఎవరూ సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.
వ్యాపార రుణాల కోసం పెద్ద ఎత్తున బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకున్నారని రుణాల కోసం వారు ఇబ్బందులు పడుతున్నారని కృష్ణమోహన్ చెప్పారు. హెల్త్ కార్డులు కూడా చాలా మందికి అందలేదని వాటిని కూడా వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి రుణాలను వెంటనే మంజూరు చేసి పెద బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Brahmin Parishad, Telangana Brahmin Samkshema Parishad, Government of Telangana, Brahmin Samkshema Parishad loans, loans of brahmin parishad, bramin parishad loans,brahmin,brahmins, brahmins of telangana,telangana brahmin, brahmin business network, bbn.

Wanna Share it with loved ones?