బ్రాహ్మణ వ్యాపారుల పరస్పర సహకారం కోసం ఏర్పాటైన వేదిక

0
63

బ్రాహ్మణ వ్యాపారస్తుల పరస్పర సహకారం కోసం ఒక వేదిక ఏర్పాటయింది. వివిధ వ్యాపారాల్లో ఉన్న వారినందరినీ ఒక చోటకు చేర్చి ఒకరి ద్వారా మరోకరికి లద్ది చేకూరేందుకుగాను ఏర్పాటయిన ఈ సంస్థకు బీ.బీ.ఎన్ (బ్రాహ్మిన్ బిజినెస్ నెట్ వర్క్) గా నామకరణం చేసుకున్నారు. ప్రస్తుతం కేవలం ఉద్యోగాల మీదనే ఆధారపడకుండా అనేక మంది బ్రాహ్మణులు ఉత్సాహంగా వ్యాపారరంగంలోకి అడుగుపెడుతున్నారని వారందరనీ ఒక చోట చేర్చాడమే ఈ వేదిక ఉద్దేశమని కార్యక్రమాన్ని సమన్వయ పర్చిన కరణం నారాయణ తెలిపారు. హబ్సీగూడాలోని ఓ హోటల్ లో జరిగిన సమావేశానికి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ వ్యాపారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణం నారాయణ పరిచయ వ్యాఖ్యలు చేస్తూ వ్యాపారంలో బ్రాహ్మణులు రాణించలేరనే అనుమానాలు అవసరం లేదన్నారు. అందరి సహకారంతో ప్రతీ ఒక్కరూ సంస్థ ద్వారా లాభపడాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. బ్రాహ్మణ వ్యాపారులు ఒకరికి ఒకరు సహకరించుకోవాలన్నారు.
పూజాద్రవ్యం ఆన్ లైన్ వ్యవస్థాపకులు శర్మ మాట్లాడుతూ కలిసికట్టుగా ముందుకు సాగితే సాధించలేనిది ఏమీలేదన్నారు. బ్రాహ్మణుల్లో ఐకమత్యం కొరవడిందనే మాట అవాస్తవమని మొదటి సమావేశానికే ఇంతమంది హాజరు కావడమే దీనికి నిదర్శనమన్నారు. ప్రతీ ఒక్కరూ ఈగో (అహాం) ను విడిచిపెట్టి వీగో (కలిసిసాగుదాం) అనే నినాదంతో ముందుకు సాగాలని పిలపునిచ్చారు. ఎవరికి వారు వ్యాపారం చేసుకుంటూ సంస్థ ద్వారా ఒకరి వ్యాపారానికి మరొకరు సహకరించుకోవాలని ఆయన కోరారు.
బ్రాహ్మణ వ్యాపారులు అంతా ఒకతాటిపైకి వచ్చే ప్రయత్నం చేయడం పట్ల ఈ కార్యక్రమానికి హాజరయిన వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేదికను వారివారి వ్యాపారాల అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here