జై సింహ డైలాగులు భేష్ అంటున్న బ్రాహ్మణ సంఘం

బాలకృష్ణ హీరోగా నటించిన జైసింహ చిత్రాన్ని బ్రాహ్మణ సమాజం ఆదరించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు పిలపునిచ్చారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులపై ఉన్న డైలాగులపై వారు హర్షం వ్యక్తం చేశారు. జై సింహ చిత్రంలో బాలకృష్ణ బ్రాహ్మణుల జౌన్నత్యాన్ని గురించి చెప్పిన డైలాగులు బాగున్నాయని సంఘం నేతలు ద్రోణంరాజు రవికుమార్, మల్లాది చంద్రమౌళిలు పేర్కొన్నారు. “మంత్రం బ్రాహ్మాణాధీనం…దైవనం మంత్రాధీనం” అంటు బాలయ్య చేత డైలాగులు చెప్పించిన దర్శక, నిర్మాతలను వీరు అభినందించారు. బ్రాహ్మణుల, అర్చకుల గొప్పతనాన్ని గురించి సినిమాలో చాలా చూపించిన దర్శకుడు కే.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ లను బ్రాహ్మణ సంఘం నేతలు కలిసి వారిని సన్మానించారు.
బ్రాహ్మణులను కించపర్చే విధంగా ఉన్న సినిమాలపై యుద్ధం చేసినట్టుగా వారి గొప్పతనాన్ని చెప్పిన సినిమా వారిని గౌరవించాలనే ఉద్దేశంతోనే వీరికి సన్మానం చేసినట్టు ద్రోణంరాజు రవికుమార్ తెలిపారు. సర్వేజన సుఖినోభవంతూ అంటూ ప్రపంచ శాంతి కాంక్షించే బ్రాహ్మణ జాతికి సంబంధిన విశేషాలను జైసింహలో చక్కగా చూపించారని కొనియాడారు. హింధూ జాతి జౌన్నత్యాన్ని కాపుడుతున్న బ్రాహ్మణుల జై సింహ చిత్రంలో పలికించిన సంభాషణలు చాలా బాగున్నాయని హర్షం వక్తంచేసిన మల్లాది చంద్రమౌళి అందుకోసం గాను దర్శక నిర్మాతలను సన్మానించినట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *