వేద పాఠశాల నిర్వాహకులను దూషించిన కేసులో బొమ్మక్ మురళిపై కేసు నమోదయింది. ఐపీసీ సెక్షన్లు 156,290,295-A,506 కింద మోడిపల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్, ఆర్ఎన్ఎస్ కాలనీలో నిర్వహిస్తున్న వేద పాఠశాలను అక్కడి నుండి తరలించాలంటూ పాఠశాల నిర్వహాకులను బెదిరించినట్టుగా శరణం గచ్చామి నిర్మాత, బొమ్మక్ మురళిపై ఆరోపణలున్నాయి. బెదిరింపులకు దిగడంతో పాటుగా వేదాలను అపహాస్యం చేసే పద్దతిలో మాట్లాడిన మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో వేదాలు అవసరం లేదని వాటి వల్ల ఎవరికీ ఏమీ ఒరిగేది లేదనే తరహాలో మురళి మాట్లాడిన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.