గోదావరిలో బోటు ప్రమాదం 50 మంది గల్లంతు?

గోదావరి నదిలో ఘోర లాంచి ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో 50 మందిదాకా గల్లంతైనట్టు భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దోవీపట్నం మండలం మంటూరు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొండ మొదలు నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 55 మంది దాకా బోటులో ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఐదుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన లాంచీలో ఓ పెళ్లి బృందం ఉన్నట్టు సమాచారం.
లాంచిలో ఉన్నది గిరిజనులని కొందరు చెప్తుండగా అందులో పర్యాటకులు ఉన్నట్టు మరో కథనం. ప్రమాదం జరిగిన సమాయానికి ఎన్జీఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వీరితో పాటుగా స్థానిక పోలీసులు, గత ఈతగాళ్లు ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. చిమ్మచీకటి, ఈదురు గాలులు, భారీ వర్షం వల్ల సహాయక కార్యక్రమాలకు ఆటకం కలుగుతోంది. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలుల వల్లే లాంచీ గోదావరి నదిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు.
లాంఛీని నిర్వహిస్తున్న ఖాజా దేవీపట్నం పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. లాంచీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరాతీశారు. సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం ఎట్లా జరిగిందనే దాని కన్నా ముందు సహాయక కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ఆ తర్వతా ప్రమాదాలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి అలోచించాలన్నారు.