మరో యాభై ఏళ్లు అధికారం మాదే

0
3

మరో 50 సంవత్సరాల పాటు దేశంలో బీజేపీనే అధికారంలో ఉంటుందని అంటున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఐదో, పదో సంవత్సరాలు అధికారంలో ఉండడం కాదని మరో 50 సంవత్సరాల పాటు తమ పార్టీదే అధికారం అంటూ ఆయన ధీమా వ్యక్తం దేశారు. గతంలో ఏన్నడూ లేనంతగా బీజేపీ దేశవ్యాప్తంగా బలోపేతం అయిందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ లో ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ పూర్తిగా బలంగా ఉందని పార్లమెంటులోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పార్టీకి గణనీయ సంఖ్యలో సభ్యులున్నారని అన్నారు. దేశాన్ని సమూలంగా మార్చే దిశగా బీజేపీ ముందుకు సాగుతోందని అమిత్ షా పేర్కొన్నారు. దీని కోసం గాను పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏదో ఐదో, పదో సంవత్సరాలు అధికారంలో ఉండేందుకు రాలేదని యాభై సంవత్సరాలపాటు బీజేపీ అధికారంలో ఉండే విధంగా కార్యకర్తలు పట్టుదలతో పనిచేయాలన్నారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదని కనీసం తమ పార్టీ దరిదాపుల్లో కూడా ఉండే స్థాయి ఏ పార్టీకీ లేదన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here