బీజేపీ అధిష్టానంతో నెయ్యం-రాష్ట్ర నేతలతో కయ్యం

0
74

బీజేపీ అధిష్టానంతో తెలుగుదేశం పార్టీ సఖ్యతను కొనసాగించాలని నిర్ణయించుకున్నా రాష్ట్రా స్థాయిలో మాత్రం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రానికి చెందిన బీజేపీ,టీడీపీ నేతలు పరస్కరం దూషించుకుంటున్నారు. విమర్శలు హద్దులు దాటిపోయాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దూషించుకుంటున్నారు. టీడీపీ నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారంటూ బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. ఇప్పటివరకు పార్టీ పైన విమర్శలు చేసిన బీజేపీ ఇంకాస్త ముందుకు వెల్లి పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేతలు పరోక్షంగా తీవ్ర విమర్శలు చేయడం దుమారాన్ని రేపింది. దీనితో టీడీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు.
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు విరుకుని పడుతున్నారు. వీర్రాజుతో పాటుగా బీజేపీ రాష్ట్రా స్థాయి నేతలపై కూడా మాటల యుద్ధానికి దిగారు. సొత్తు కోసం తాము వెంపర్లాడడం లేదని బీజేపీ నేతలు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని మాట్లాడాలంటూ విరుచుకుని పడ్డారు. బీజేపీ రాష్ట్రా స్థాయిలో నేతలు తమని తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే స్థాయి రాష్ట్ర బీజేపీ నేతలకు లేదని అంటున్న టీడీపీ నేతలు కొంత మంది బీజేపీ నాయకులు వైసీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు.



Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here