గుజరాత్,హిమాచల్ లలో బీజేపీ హవా

గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి ముందంజలో ఉంది. గుజరాత్ లో బీజేపీ అధికారాన్ని నెలబెట్టుకునే దిశగా దూసుకుని పోతుంటే ఇటు హిమాచల్ ప్రదేశ్ లోఅధికార కాంగ్రెస్ ఢీలా పడింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో బీజేపీ 105 కు పైగా స్థానాల్లో ఆధీక్యంలో ఉండగా కాంగ్రెస్ 74 సీట్లను ముందజంలో ఉంది. గుజరాత్ లో బీజేపీ కాంగ్రెస్ లు మినహా ఇతర పార్టీల హవా పెద్దగా కనిపించడం లేదు. బీజేపీ అధిరం కైవసం చేసుకోవడం ప్రస్తుతానికి దాదాపుగా ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ బలం కూడా గణనీయంగా పెరిగింది. 76కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడిందనే చెప్పాలి. ఇటు హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ కమలం పార్టీ 40కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ 21 సీట్లలో మెజార్టీలో ఉంది. ఇక్కడ మొత్తం 68 స్థానాలు ఉన్నాయి.