బాసరకు పోటెత్తిన భక్తులు

వసంతపంచమి సందర్భంగా చదువుల తల్లి సరస్వతిని కొలుచుకుంటున్నారు. జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న బాసర క్షేత్రానికి భక్తులు పోటేత్తారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుండే భక్తుల రద్దీ కనిపించింది. ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే సరస్వతి కృప కలుగుతుందనే నమ్మకంతో పెద్ద సంఖ్యలో తమ పిల్లలకు అమ్మవారి సమక్షంలో అక్షరాలు దిద్దిస్తున్నారు. అక్షరాల మండపాలు నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండడంతో అక్షరాభ్యాస కార్యక్రమానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. అమ్మవారి దర్శనానికి మూడు గంటలు పడుతోంది.
వసంత పంచమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇఁద్రకరణ్ రెడ్డి తదితరులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆలయ అధికారుల తెలిపారు. అయినా పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు తిప్పలు తప్పడంలేదు.