సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు

బ్యాంకులు మూతపడ్డాయి… ఏటీఎం లలో ఎప్పటిమాదిరిగానా డబ్బులు లేవు… ఆన్ లైన్ లావాదేవీలు మినహా బ్యాంకు కార్యకలాపాన్ని ఆగిపోవడంతో నగదు కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎటీఎంలలో నగదు కొరత సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్తా కుదుటపడుతున్నాయన్న సమయంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె కు దిగడంతో తిరిగి పరిస్థితులు యాధావిధిగా మారాయి. బ్యాంకులకు వెళ్లి నగదు తెచ్చుకుందానుకున్నా కుదరని పరిస్థితి. ఒకటి అరా బ్యాంకులు పనిచేస్తున్నా అధికశాతం బ్యాంకులు సమ్మే కారణంగా మూతపడ్డాయి.
వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంకు యాజమాన్యాలతో జరిపిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మే బాట పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 80వేల మందిదాగా సమ్మెలో పాల్గొంటున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా విదేశీ బ్యాంకులు, పాత తరం ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు ఉద్యోగ సంఘాలు వెళ్లడించాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈసమ్మెలో పాల్గొంటున్నారు.
ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం లేదనేది వారి ఆరోపణ. వేత సవరణ కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని వారు చెప్తున్నారు. కంటితుడుపు చర్యగా 2శాతం వేతన సవరణకు ప్రభుత్వం అంగీకరించడం దారుణమని వారంటున్నారు. అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో కేవలం 2శాతం వేతన సవరణకు అంగీకరించడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగానే దేశవ్యాప్తంగా 48 గంటల పాట బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 6.00 గంటల నుండి శుక్రవారం ఉదయం 6.00 గంటల వరకు బ్యాంకులు మూతపడనున్నాయి.
బ్యాంకు ఉద్యోగుల జీతాలను పెంచేందుకు యాజమాన్యాలు సిద్ధంగా లేవు. ఇప్పటికీ అనేక జాతీయ బ్యాంకులు నష్టల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇచ్చిన అప్పులు తిరిగి రాక బ్యాంకుల పరిస్థితి ధీనంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరర్థక ఆస్తులు చేరుకున్నాయి. బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల బకాయిలు తిరిగి రాకపోవడంతో బ్యాంకుల పరిస్థితి దయనీయంగా తయారయింది. బ్యాంకులను ఆదుకోవాలంటే లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సహాయం అవసరం అయింది.
అయితే బ్యాంకు ఉద్యోగ సంఘాల వాదన మాత్రం ఇందుకు విరుద్దంగా ఉంది. ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితికి ఉద్యోగులు ఎంత మాత్రం కారణంగా కాదని, బ్యాంకుల యాజమాన్యాలతో పాటుగా ప్రభుత్వ నిర్వాకం వల్లే బ్యాంకులు దివాలా తీసే స్థాయికి చేరుకున్నాయని వారంటున్నారు. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన బాడాబాబుల విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరివల్లే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించిందని వారంటున్నారు. వందలకోట్ల రూపాయల మేర బకాయిలు పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిస్కరించాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
bank, bank employees, bank strike, state bank india, banks going on strike.

ప్రాణాలు తీస్తున్న అబద్దపు ప్రచారాలు


వైరల్ అవుతున్న దొంగల ముఠా వార్తలు-అబద్దాలు ప్రచారం చేస్తే జైలుకే
List_of_banks_in_India