డిసెంబరు 30 తరువాత కూడా ఆంక్షలు తప్పవు

పెద్ద నోట్ల రద్దు తరువాత పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం డిసెంబర్ 30వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. ప్రజలకు 50 రోజుల పాటు నగదును డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం నగదును ఉపసంహరించుకునేందుకు కూడా 30వ తేదీ వరకు పరిమితులు విధించింది. నగదు ను విత్ డ్రా చేసుకునేందుకు వారానికి 24వేల వరకు గడుపు విధించారు. డిసెంబర్ 30వ తేదీ కల్లా విత్ డ్రా లపై పరిమితులు ఎత్తిస్తారని అంతా భావించారు. అయితే డిసెంబర్ 30 తరువాత కూడా నగదు విత్ డ్రా పై ఆంక్షలు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నగదుపై ఆంక్షల ఎత్తివేత ఇప్పుడప్పుడే కుదిరేలాగా కనిపించడంలేదు.
దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఏటీఎంల పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. ఎక్కువ శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. చాలా బ్యాంకుల్లో నగదు నిల్వలు కనిపించడం లేదు. నగదు కొరతతో బ్యాంకుల నుండి బయటికి వచ్చిన నగదు కూడా ప్రజల దగ్గర ఉండిపోతోంది కానీ తిరిగి బ్యాంకులకు చేరడం లేదు. దీనికి తోడు పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లో కొత్త నోట్లు తిరిగి కొంత మంది ఇనప్పెట్టేల్లోకి చేరిపోయాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో డిసెంబర్ 30 నాటికి ఆంక్షలు ఎత్తివేస్తారనే ఆశ ఎవరికీ లేదు. అప్పటికి పరిస్థితిలో మార్పులు వస్తాయని ఎవరూ ఆశించడం లేదు. 50 రోజుల్లో అంతా తిరిగి యధావిధిగా మారిపోతుందనే ప్రధాని భరోసా కార్యరూపం దాల్చేఅవకాశాలు కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *