చిన్నారిని గొడ్డునుబాదినట్టు బాదిన కసాయి తండ్రి

0
52

తెలిసీ తెలియని వసయులు పిల్లలు చేసే తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కొన్ని సార్లు ఈ క్రమంలో వారిని దండించడం కూడా మామూలే. అయితే దండన మరీ శృతిమించితే.. తల్లదండ్రులే పిల్లల పాలిట రాక్షసులుగా మారితే… ఇటుంటి ఘటనే బెంగళూరులో జరిగింది. అబద్దం చెప్పిన 10 సంవత్సరాల వయసున్న బాలుడిని తండ్రి దారుణంగా హింసించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పిల్లవాడిని తండ్రి అతి దారుణంగా కొడుతున్నా ఆపాల్సిన తల్లి కూడా తండ్రికి వంతపాడడంతో పాటుగా దాన్ని వీడియో తీసింది. సదరు మొబైల్ రిపేర్ కు రావడంతో దుకాణుదారుడు వీడియోను ఎన్జీవోలతో పాటుగా పోలీసులకు పంపడంతో కిరతాక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.



Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here