కన్నుల పండుగ్గా భద్రాద్రి రాముడి తెప్పోత్సవం

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భద్రాచల రాముడి తెప్పోత్సవం కన్నుల పండగ్గా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించి పులకించారు…ముక్కోటిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి తరలివచ్చారు. ముక్కోటి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం రాత్రి నుండే భక్తులు వేచిఉంటారు. ముక్కోటికి ఒకరోజు ముందు జరిగే ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి ఒడ్డుకు తరలివచ్చారు.